19-01-2026 10:03:04 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): మత్స్యశాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు రిజర్వాయర్ లో లక్ష రొయ్య పిల్లలను ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట వేయడం జరిగిందని, పెద్దవాగు ప్రాజెక్టు రిజర్వాయర్ ను గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసినందున ఈ సంఘంలో ఉన్న గిరిజన మత్స్యకారులు అందరూ రొయ్యలు ఎదిగిన తరువాత పట్టుబడి చేసి అమ్ముకోని ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి, కోయరంగాపురం గ్రామ సర్పంచులు శ్రీమతి. పాయం శ్రీదేవి, శ్రీమతి. సోడెం చిన్న గంగమ్మ , పంచాయతీ కార్యదర్శులు సోయం బాబు , క్రాంతి కుమార్, మత్స్య క్షేత్రస్థాయి అధికారులు, మిడియం మంగరాజు, బెజవాడ భార్గర్, కుంజా సూర్య ప్రకాష్, మత్స్య సహకార సంఘ సభ్యులు మడివి రాంమూర్తి, జల్లి శ్రీను, చిచ్చుడి సీతారాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు ,గుమ్మడి పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు SK. బాబా , కోయ రంగాపురం. అధ్యక్షులు జల్లి అర్జున్ రావు. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి చెన్నారెడ్డి , శివరాశి సురేష్ ,ఎస్ కే యాకుబ్ , వల్లెపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.