20-01-2026 12:00:00 AM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ముషీరా బాద్ నియోజకవర్గం పరిధిలోని పఠాన్బస్తీ ప్రాంతంలో రూ. 22.75 లక్షల తో హెచ్‌ఎంసీడబ్ల్యూ అండ్ ఎస్బీ డ్రైనేజ్ పైప్లైన్ పనుల ను ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, యువజన నాయకుడు ముఠా జై సింహలతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొండ శ్రీధర్ రెడ్డి, దీన్ దయాల్ రెడ్డి, ముషీరాబాద్ మీడియా ఇంచార్జి ముచ్చ కుర్తి ప్రభాకర్, శివ ముదిరాజ్, శ్రీధర్ చారి, ఇమ్రాన్ ఖాన్, జావేద్ ఖాన్, మహబూబ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ సర్వర్, బల్ల ప్రశాంత్, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, ఎం. రాకేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లల శ్రీనివాస్ యాదవ్, ఎ. శంకర్ గౌడ్, వంగల నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు ఆర్. కల్పన యాదవ్, పెండెం శ్రీనివాస్ యాదవ్, పట్నం నాగభూషణం గౌడ్, మోహిన్, జి ఎన్ చారి, రామకృష్ణ ముదిరాజ్, బిజెపి నాయకులు నవీన్ గౌడ్, వాసు, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కార్యక్రమంలో హాజరై అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.