25 June, 2026 | 1:46 AM

రావల్‌కోల్‌లో అనుమతులు రద్దు చేయాలి

25-06-2026 01:02 AM

ఎల్లంపేట్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్

మేడ్చల్ అర్బన్, జూన్ 24 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్  పరిధిలోని రావల్ కోల్  సమీపంలోని సర్వే నంబర్ 111 లో నూతన క్రషర్ మిషన్ కు అనుమతులు రద్దు చేయాలని రిలే నిరాహార దీక్ష చేసినట్లు మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఎక్కల దేవి శ్రీశైలం యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్టోన్ క్రషర్ మిషన్ కు అనుమతులు రద్దు చేయాలని గత 40 రోజుల నుండి రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టిన రైతుల సమస్యపై తహసిల్దార్, ఆర్డీవో లతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు.రావల్ కోల్ పట్టణ సమీపంలో నూతన స్టోన్ క్రషర్ అనుమతులపై రైతులు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులను రద్దు చేయాలని శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నూతన క్రషర్ అనుమతులను రద్దు చేయకపోతే సమస్యపై పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల వెంకటేష్.పిట్ల సాయిలు.వై బిక్షపతి.పిట్ల శ్రీధర్. బంటు మల్లేష్.వై వెంకయ్య.బంటు నర్సింగ్ రావు.వై నాగేష్ తదితరులు పాల్గొన్నారు...