25 June, 2026 | 1:45 AM

పొలాల వద్దనే ‘ధరణి’ సమస్యలకు పరిష్కారం

25-06-2026 01:00 AM
  1. లక్ష్మీదేవిపల్లిలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
  2. బయోమెట్రిక్ ద్వారా ఫైల్‌ను క్లియర్ చేసిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

షాద్ నగర్, జూన్ 24 (విజయక్రాంతి):  లక్ష్మీదేవిపల్లి గ్రామస్తుల  రైతులు ధరణిలో ఏర్పడిన సమస్యతో సతమతమయ్యారు. కా నీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో  రైతు ల పంట పొలాల వద్దకు వెళ్లి అక్కడే అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించడం జరిగిండి. సమస్యలు వెంటనే గ్రామస్తుల స మక్షంలో పరిష్కరించి ధరణి లోపాలను తొ లగిస్తూ పరిష్కారం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొం దుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటు న్న భూ రికార్డుల సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. 

ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం గ్రామ భూ విస్తీ ర్ణం 106 ఎకరాలు 34 గుంటలు ఉండగా, తాజా రికార్డుల్లో 118 ఎకరాలు 14 గుంటలు నమోదవడంతో దాదాపు 12 ఎకరాల అదనపు విస్తీర్ణం నమోదైనట్లు గుర్తించారు. అలాగే కొంతమంది రైతులు భూములు విక్రయించినప్పటికీ ఇప్పటికీ వారి పేర్లు లేదా వారి వారసుల పేర్లు రికార్డుల్లో కొనసాగుతుండగా, వాస్తవంగా భూములు పొం దిన వారి పేర్లు నమోదు కాకపోవడంతో సమస్యలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి భూ సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు.  లక్ష్మీ దేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రత్యేకంగా స్పందించారు. కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ తదితర అధికారులు వెంకిర్యాల గ్రామ శివారులోని రైతుల పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

అధికారులు ప్రజా పాలన కార్యక్రమంలో స మర్పించిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి, సంబంధిత దరఖాస్తులపై సంత కాలు చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగేలా ప్రతి భూ సమస్యను పారదర్శకంగా పరిష్కరిస్తామని, ధరణి రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్ది అర్హులైన రైతులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.