28 April, 2026 | 3:06 AM

కాచాపూర్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన

28-04-2026 12:42 AM

భిక్కనూర్, ఏప్రిల్ 27:(విజయ క్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దోమకొండ ఎక్సైజ్ స్టేషన్ బృందం భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర దీపిక మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలమకుల జ్యోతి సంతోష్ గౌడ్, వార్డు సభ్యులు, యువత పాల్గొన్నారు. ఎస్త్స్ర దీపికతో పాటు కానిస్టేబుళ్లు నవీన్, విజయ్, శ్రీకాంత్, స్వప్న పాల్గొన్నారు.