21-01-2026 05:23:56 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు విలేకార్లతో మాట్లాడుతూ రేషన్ షాప్ డీలర్లు ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఫణిగిరి గ్రామ రేషన్ షాప్ డీలర్ విశాఖ వెంకటరెడ్డి తన పరిధిలో మన ప్రజలకు రేషన్ కార్డు మీద రావాల్సిన బియ్యంను అక్రమంగా తీసుకోవడం జరుగుతుందని ఆరోపించారు.
మరణించిన, పెళ్లి అయిపోయిన వ్యక్తిలను రేషన్ కార్డు జాబితాలో తొలగించకపోయిన రేషన్ బియ్యం ఇచ్చినట్టు బిల్లు లేదా రికార్డు లో నమోదు చేసి యజమానికి ఇవ్వకుండా తానే తీసుకోవడం జరుగుతుంది. ఇలా అక్రమంగా తీసుకొని ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇట్టి విషయంపైన జిల్లా అదనపు కలెక్టర్, ఎమ్మార్వో కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జరిగిన సంఘటనపై విచారణ జరపాలని ఆయన కోరారు