29 June, 2026 | 2:02 AM

కందనూల్ పట్టణంలో చిల్లర దొంగలు

29-06-2026 12:00 AM

నాగర్ కర్నూల్ జూన్ 28 ( విజయక్రాంతి ):  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చిల్లర దొంగలు హల్చల్ చేస్తున్నారు. అర్ధరాత్రిలో ఇంటి ఆవరణలోకి చొరబడి కిటికీలోంచి సామాగ్రిని దొంగలిస్తున్నారు. ఇంటి ఆవరణంలోని నీటి కులాయి సామాగ్రిని తొలగించి అమ్ముకొని సొమ్ము చేస్తున్నారు. పటంలోని నల్లవెల్లి రోడ్డు లోని 21వ వార్డు పరిధిలో అర్ధరాత్రిళ్ళు కొంతమంది యువకులు ఇంటి ఆవరణలోకి గోడ దూకి చొరబడ్డారు.

ఓ ఇంట్లో కిటికీ పక్కనే ఉన్న కొంత సామాగ్రి సెల్ఫోన్ సిమ్ కారడ్స్, పాకెట్ లో ఉన్న చిల్లర డబ్బులు దొంగిలించారు. ఆ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సిసి టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా పోలీసులకు సమాచారం అందించారు. విలాసాలకు తాగుడికి బానిసలుగా మారిన యువత ఇలా ఈజీ మనీ కోసం పెడదారిన పడుతున్నారు. దీంతో పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం పట్టపగలే ఇలాంటి దొంగతనాలకు పాల్పడి దొరికిన యువకుడ్ని పట్టణానికి చెందిన ఒక కౌన్సిలర్ తన పరపతి ఉపయోగించి కేసులు నమోదు కాకుండా ఈజీగా విడిపించుకొని పోవడంతో తిరిగి అలాంటి రకమైన దొంగతనాలు రాత్రి వేళల్లోనూ జరగడంతో పోలీసుల తీరు పట్ల పట్టణవాసులు మండిపడుతున్నారు. రాత్రి వేళల్లోనూ గస్తీ నిర్వహించడకపోవడం కారణంగా దొంగతనాలు పెచ్చుమీరుతున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.