తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి
29-06-2026 12:00 AM
సర్పంచ్ భగవంత్ రెడ్డి
గండీడ్, జూన్ 28 : చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామ సర్పంచ్ భగవాన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కేంద్రంలో చిన్నారులకు సర్పంచ్ పోలియో చుక్కలను వేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు నిండు ప్రాణం అనే నినాదంతో అందరూ పోలియోచ్చుకులను వేసుకొని ఆరోగ్యంగా ఉండేలా చిన్నారుల తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య, గండీడ్ ఆరోగ్య కేంద్రం డాక్టర్ చెంద్రశేఖర్, సూపర్డెంట్. గోపాల్ రెడ్డి, ప్రసాద్. రేణుక. ఆశ వర్కర్లు చిట్లపల్లి శామాలమ్మ, ఎండీ నహీదా, వేపురి చెన్నమ్మ, వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.






