2 May, 2026 | 6:44 AM

దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ

13-08-2024 12:32 PM

మంచిర్యాల: నస్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలోని భవిత కేంద్రంలో మంగళవారం దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు దివ్యాంగ విద్యార్థులు ఈ భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ జాడి పోచయ్య కోరారు. ఫిజియోథెరపీ కోసం 99480 79070, 88971 75096లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ శ్రీకర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.