వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలలో పాల్గొన్న పిల్లుట్ల రఘు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల(Nereducherla Mandal)లోని మూసి ఒడ్డు తండా, పులగంబండ తండా, చిల్లేపల్లి, చింతకుంట్ల, బూరుగుల తండా, ముకుందాపురం, దాసారం,పెంచికల్ దిన్నె గ్రామ పంచాయతీలతో పాటు నేరేడుచర్ల పట్టణంలో ఉన్నటువంటి వివిధ వినాయక స్వామి మండపాలలో వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ(BRS Party) హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,నేరేడుచర్ల మండల ప్రజలతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలపై స్వామివారి కృపా, కరుణ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కోనతం లచ్చిరెడ్డి, బిఆర్ ఎస్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడ్యా శ్రీను నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పంగ శ్రీను టిఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు నగేష్ రాథోడ్ శివారెడ్డి గుమ్మడివెళ్లి వెంకన్న జంపాల వెంకన్న దాసారం సర్పంచ్ వీరారెడ్డి, పెంచికల్ దిన్న సర్పంచ్ సోములు మరియు యుత్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.