calender_icon.png 30 September, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలి

30-09-2025 07:14:31 PM

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

చిలుకూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిలుకూరు మండలంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని గులాబీ జెండాను ఎగరవేయాలని, మంగళవారం జరిగిన బీఆర్ఎస్ చిలుకూరు మండల ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని గ్రామపంచాయతీ, మండలంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కినపల్లి జానకి రామాచారి, కార్యదర్శి అంబాల రాంబాబు, పిఎసిఎస్ చైర్మన్ అలస కాని జనార్ధన్, జానీ మియా, బట్టు శివాజీ, దొడ్డ సురేష్, అన్నపూర్ణ, తాళ్లూరి శ్రీను, పాషా, బెల్లంకొండ నాగయ్య, అచ్చయ్య, పాల్గొన్నారు.