10 June, 2026 | 2:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఎంసీహెచ్‌లో చిమ్మ చీకటి

05-07-2024 12:05 AM
  • రెండున్నర గంటలు కరెంట్ కోత 
  • ఆపరేషన్ నిలిపేసిన వైద్యులు 
  • చీకట్లోనే బాలింతలు, గర్భిణులు 

మంచిర్యాల, జూలై 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలకుపైగా ఎంసీహెచ్ అంధకారంలో ఉండిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎంసీ హెచ్‌కు వచ్చే విద్యుత్ కేబుల్ చెడిపోవడంతో బుధవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల నుంచి 11.30 గంటల వరకు కరెంట్ సరఫరా కాలేదు.

కరెంట్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన గర్భిణీని వాపసు తీసుకువచ్చారు. ఐసీయూలో ఉంచిన చిన్న పిల్లలను కుటుంబ సభ్యులు బయటకు తీసు కురాగా.. బాలింతలు, గర్భిణులు చీకట్లోనే ఉక్కపోతతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ఇబ్బందులు పడ్డారు. ఎంసీహెచ్‌కు ఎలక్ట్రిషియన్ లేకపోవడంతో జిల్లా ఆస్పత్రి సిబ్బంది వచ్చి నూతన కేబుల్ వేయడంతో విద్యుత్ సరఫరా జరిగింది.