11 July, 2026 | 6:28 PM

జెట్టక్కను తరిమికొట్టే కార్యక్రమం విజయవంతం చేయాలి: సర్పంచ్ గండి నారాయణ

11-07-2026 05:26 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోఆదివారం రోజున జెట్టక్కను తరిమికొట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు.గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలో మన పూర్వీకులు గ్రామంలోని జెట్టక్కను అనగా దరిద్ర దేవతను గ్రామంలో నుండి వెల్లగొట్టలనే ఉద్దేశంతో ఇంట్లోని పాతవస్తువులను బట్టలను చీపురు కట్టలను చటలను ఇతర వస్తువులను డప్పుల మోతలతో గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లి పడేయడం వల్ల గ్రామంలోని జెట్టక్క దరిద్ర దేవత బయటకు వెళ్లి లచ్చక్క అనగా లక్ష్మీదేవి గ్రామంలోకి వస్తుందని దానితో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుంటాయని మన పూర్వీకులు ఇట్టి ఆచారం తీసుకువచ్చారని మన గ్రామంలో ఆదివారం రోజున జెట్టక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలు కుల సంఘాల సభ్యులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.