27 August, 2026 | 3:43 PM

లోక్య తండలో ఘనంగా వన మహోత్సవం

27-08-2026 02:35 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం లోక్య తండలో(Lokya Thanda) సర్పంచ్ వడిత్య వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల నాయకులు ముదిరెడ్డి కేశవరెడ్డి, ఇంటూరి పుల్లయ్య , మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి,ఉప సర్పంచ్ నీలా రాజ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీను నాయక్ ,  పాలక వర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్య నాయక్ యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.