వదల్పర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎంపీడీవో
నాగిరెడ్డిపేట్,ఆగస్టు 27 (విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామంలో సర్ ప్రక్రియలో భాగంగా గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామసభకు ఎంపీడీవో గంగాధర్ పాల్గొన్నారు.వదర్పర్తి గ్రామానికి 622 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా వాటిని గ్రామస్తులకు పంపిణీ చేశారు.అలాగే 22 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా వాటిని ఎంపీడీవో గంగాధర్ పరిశీలించి పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు.మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలను,అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేరేలా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,ఉపసర్పంచ్ కడేము శ్యామల గంగారం, ఎంపీడీవో గంగాధర్,కార్యదర్శి అశోక్, జిపిఓ పెంటయ్య, ఫీల్డ్అసిస్టెంట్ నర్సింలు, వార్డుమెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.






