6 July, 2026 | 9:18 PM

Breaking News

బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •  

ఖానాపూర్ బస్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు

30-05-2025 06:06 PM

ఆర్టీసి నిర్మల్ డిపో మేనేజర్ పండరి

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ పండరి అన్నారు. శుక్రవారం ఆయన ఖానాపూర్ బస్టాండ్ ను పరిశీలించారు. ప్రైవేట్ వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులతో చర్చించామని దాంతోపాటు కాంపౌండ్ వాల్ నిర్మాణం, మరుగుదొడ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పిస్తామని అన్నారు.

బస్టాండ్ లోపల ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను మరమ్మత్తులు చేపట్టి, మిగిలిన షాపులకు టెండర్లు పిలిస్తామని అన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. దాంతోపాటు ఖానాపూర్ నుంచి సాయంకాలం శంషాబాద్ కు ఉన్న బస్సు సర్వీస్ను కడెం కు పొడిగించే ప్రతిపాదన చేస్తామని అన్నారు. దాంతోపాటు తెల్లవారుజామున 5: 15 హైదరాబాద్ బస్సును పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు .ఆయనతోపాటు ఆర్టీసీ ఇంజనీర్ అధికారులు, కంట్రోలర్ పోశెట్టి తదితరులు ఉన్నారు.