17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆన్​లైన్​లో మోసం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు

30-05-2025 06:17 PM

తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని వోల్వో బస్సు డ్రైవింగ్ నేర్పించి మరియు డ్రైవర్ గా జాబ్ ఇప్పిస్తానని ఫోన్ కాల్ ద్వారా నమ్మించిన పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన వరప్రసాద్ అనే నిందితున్ని అరెస్టు చేయడం జరిగినది. పిర్యాదు తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4,30,000/- తన ఫోన్ పే ఖాతాలోకి కొట్టించుకొని చాలా రోజూలుగా తప్పించికుంటూ ఫిర్యాదికి అబద్దపు మాటలు చెప్పి మోసపరచిన నిందితుడుపై నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పథకం ప్రకారం పట్టుబడి చేసి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినదని  తుంగతుర్తి సీఐ తెలిపినారు. 

పట్టుబడిన విధానం:  ఉదయం పోలీస్ వారి సలహా మేరకు ఫిర్యాది నెరస్తుడికి ఫోన్ చేసి తను అడిగిన కొంత డబ్బులని సూర్యాపేట కి వస్తే ఇస్తా అని చెప్పగా నేరస్థుడు మాచర్ల నుండి సూర్యాపేట కి రాగా నేరస్తుడిని నూతనకల్ పోలీస్ సిబ్బంది సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో ఉదయం 11.00 గంటల సమయంలో పట్టుబడి చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాగా తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. నరసింహ రావు  నేరస్తుడిని తుంగతుర్తి గౌరవ కోర్టు నందు హాజరు పరచి రిమాండ్ కి పంపించనైనది. తుంగతుర్తి సర్కిల్ ప్రజలు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.