తాగునీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు
- రూ. 220 కోట్ల తో తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నాం
- మహానగరంగా మహబూబ్ నగర్ అవతరిస్తుంది
- అప్పటికీ ఇప్పటికీ హరీష్ రావు మారిపోయిండ్రు
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) : భవిష్యత్తులో మహబూబ్ నగర్ మహానగరంగా అవతరించబోతుందని ప్ర భుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గడిచిన రెండేళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వంలో మన బిడ్డ సీఎం రే వంత్ రెడ్డి ఉండడంతో అత్యధిక నిధులు తీ సుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
రూ 220 కోట్ల నిధులతో తాగునీ టి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పైప్లైన్ ఏర్పా టు చేయడంతో పాటు అవసరమైన ప్రాం తాలలో నీటి నిల్వ చేసేందుకు గాను ట్యాం కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్, ఎడ్యుకేషన్, రవాణా హబ్ లుగా రూ పాంతరం చెందింది ఎందుకు అడుగులు పడుతున్నాయని స్పష్టం చేశారు.
ట్రిపుల్ ఐటీ రావడం తో ఎన్నో విద్యా సంస్థలు వ స్తాయన్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవతరించడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నగరం లో 3లక్షల 30 వేల జనాభా ఉందని, విజన్ -2047 లోపు 5లక్షల జనాభా ఉంటుందన్నారు. రూ 220 తాగునీటి
40 మిలియన్ లీటర్లు అవసరం ఉందని, ఇప్పుడు 30 మిలియన్ లీటర్ల వాటర్ వస్తుందని, చెబుతున్న ఇంత కూడా రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పంపింగ్ సిస్టం సరిగ్గా లేకపోవడంతో రావాల్సినంత నీరు రావడం లేదన్నారు. లీకేజీల కారణంగా ఇబ్బందులు ఉన్నాయని పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 186 లక్షల లీటర్ల నీళ్లను నిల్వ ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నిర్మించినందుకు చర్యలువస్తున్న బైపాస్ రోడ్లకు పక్కన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైపులైన్లు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరం ఎటువైపు అభివృద్ధి చెందిన ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల ద్వారా మీరు పూర్తిస్థాయిలో సరఫరా ఎందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 209 కిలోమీటర్లు అదనంగా పైప్ లైన్ చేయడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా నీటీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించ లేదన్నారు.. జడ్చర్ల రాంరెడ్డి గూడ నుంచి వస్తున్న నీరు సరిపోవడం లేదని భవిష్యత్తులో సరిపోదని, వేలమంది వచ్చి ఇక్కడ ఉండదు అవకాశం ఉంటుందన్నారు. 60 మిలియన్ లీటర్లు నీరు అవసరం ఉంటుందన్నారు.
ఎస్టీపి ల నిర్మాణం మొదలు కావడం జరిగిందన్నారు. 2 పూర్తి కావడం జరిగిందని, మరొకటి చేయాల్సి ఉందన్నారు. మనం కూడ కొంత త్యాగం చేయాలని పేర్కొన్నారు. భూమి ఇవ్వాలనుకునేవారు ఇస్తే అభివృద్ధికి ఎంతో సహకరించిన వారు అవుతారని, మార్కెట్ వేల్యూ కాకుండా ప్రభుత్వ నిబంధన మేరకు వారికి పరిహారం అందించడం జరుగుతుందన్నారు.




