5 June, 2026 | 5:50 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

ప్రతి వ్యక్తి పుట్టినరోజు రెండు మొక్కలను నాటండి

05-06-2026 04:36 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రతి వ్యక్తి తన పుట్టినరోజున రెండు మొక్కలను నాటి వాటిని బ్రతికించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కంభం సందీప్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని  పోచ్చేర జలపాతం వద్ద వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు వాతావరణంలో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయని అయితే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను రక్షించడం మన ప్రధాన కర్తవ్యంగా భావించాలన్నారు. అడవులను నిర్లక్ష్యం చేస్తే భావితరాలకు మనం నష్టం చేసినవారమవుతామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ పంద్రం శంకర్ న్యాయవాదులు కుమ్మరి విజయకుమార్ జమీర్ అహ్మద్ ఖాన్ ఎస్ మహేష్ ఎఫ్బి ఓ వసంత్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.