5 June, 2026 | 5:49 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

ఆదివాసులపై ప్రభుత్వ చర్యలు మానుకోవాలి

05-06-2026 04:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి గిరిజనులు తమ హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వం వారిపట్ల వివక్ష చూపుతూ నిర్బంధం చేయడం మానుకోవాలని తెలంగాణ సామాజిక కార్యకర్త ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమకారుడు అజయ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల సమస్యలపై గిరిజనులు ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు.

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవిస్తే నిర్మల్ అదిలాబాద్ ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో వారి ఉద్యమాలను అడ్డుకోవడం వారిపై కేసులు పెట్టడం సరైన కాదన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం తాగునీరు సాగునీరు విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల లదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పీపుల్స్ ఫ్రంట్ పాదయాత్రలో పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

గిరిజన గ్రామాల్లో ప్రజల మోడీకి సదుపాయాలు కల్పించాలని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అటవీ ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేయాలని గిరిజనులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.