16 April, 2026 | 10:27 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

గడిచిన పనులకు శిలాఫలకలు నాటుతున్నారు

26-06-2025 11:02 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): తమ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) శిలాఫలకలు నాటి శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ వార్డు గులాబీ నాయకులు గడ్డం రాజు మండిపడ్డారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 14వ వార్డు పోచమ్మ బస్తీ కాలనిలో బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా పట్టణ ప్రగతి నిధుల నుండి రూ.13 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఈక్విప్మెంట్ నిర్మాణం చేయగా ఆరు నెలల క్రితమే కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

డిఎమ్మెఫ్టీ నిధుల నుండి రూ.4 లక్షల నలబై వేల సిసి రోడ్డ నిర్మాణం పనులు చేయగా 2నెల క్రితమే కాలనీ వాసులకు రాకపోకలు చేస్తున్నారని అన్నారు. 14 వార్డులో అనేక అభివృద్ధి పనులను చేసుకున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమలు చేయడం మానుకోవాలని అలాగే అభివృద్ధికి చిత్తశుద్ధి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులతో పురపాలకన్ని మరింత అభివృద్ధి పనులతో ముందుకు తీసుకువెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్, అలుగుల సత్తయ్య, ఎల్లబెల్లి మూర్తి, కొండ కుమార్, రామిడి లక్ష్మీకాంత్, గాజుల చంద్రకిరణ్, వేనంక శ్రీనివాస్, నందిపేట సదానందం, ఓదెలు, కల్వల సతీష్, మణి తదితరులు పాల్గొన్నారు.