12 June, 2026 | 3:06 AM

కొత్తగూడెం ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అప్రమత్తమైన మేయర్ మూడ్ గణేష్

12-06-2026 01:54 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 11: (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో తాగునీటి సమస్య గల ఎత్తకుండా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అప్రమత్తమయ్యారు.

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన తాగునీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడంతో పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ శ్రీ మూడ్ గణేష్ గారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ డీఈ, ఏఈ ,వాటర్ సప్లై సిబ్బందితో మాట్లాడిన మేయర్ గారు, వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకువాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని సూచించిన మేయర్ గారు, నేను మళ్లీ  వచ్చి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తాను అని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ౄE నరేష్ రెడ్డి, AE శ్రీకాంత్ వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.