అర్హులైన రైతులకు పిఎం కిసాన్ అమలు చేయాలి

27-08-2026 | 12:31pm

కేసముద్రం (విజయక్రాంతి): కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం(Upparapalli Village)లో ఎంసిపిఐయు అనుబంధ ఏఐసిటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ డబ్బులను అర్హులైన రైతులందరికీ ఇవ్వాలని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న(Kancha Venkanna) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వము1-2-2019 సంవత్సరం వరకు మాత్రమే నిర్ణయించి పీ.ఎం.కిసాన్ డబ్బులు రైతులకు వేస్తున్నదని, అయితే అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మంది రైతులు కొత్తగా భూమి పట్టాలు కలిగి ఉన్నారని, అటువంటి రైతులను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వము ఏమీ పట్టనట్లుగా ఉన్నదని, ఇది సమంజసం కాదన్నారు.

ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి ఉండబడిన బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. రైతులకు న్యాయం జరిగే విధంగా వారు కృషి చేయాలని ఆయన అన్నారు. పీ.ఎం.కిసాన్ డబ్బులు రైతులందరికీ వచ్చేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కంకల మల్లేశం, కుండే మహేందర్, కంకల శ్రీనివాస్, బుర్రి ఐలయ్య, కంచ కొమురయ్య, కంకల శేఖర్, కుప్పలయ్య, రాంబాబు తోపాటు రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు