హెల్మెట్ తప్పనిసరి,సైబర్ నేరలపై జాగ్రత్త వహించండి
కేసముద్రం (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కేసముద్రం సీ ఐ సత్యనారాయణ(C. I. Satyanarayana) తెలిపారు. యువతను ఉద్దేశించి బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పోలీస్ కళాజాత బృందం ద్వారా సామాజిక సమస్యలపై పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మూఢనమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, డయల్ 100 సేవల వినియోగం వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, గంజాయి వినియోగం, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలు, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై కూడా వివరించారు. అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి, ఉపసర్పంచ్ ఆవుల ఐలయ్య , వార్డు సభ్యులు జెనిగల అనిల్ కుమార్, రాజబోయిన శ్రీనివాస్, బోనగిరి జ్యోతి, కంచ రాజ్ కుమార్,కుoడే బాల కుమార్, తండా సంపత్, బండారు యాకమ్మ& గోపీనాథ్, మంద ప్రవీణ్, కారోబార్ కంచ కట్టయ్య, కానిస్టేబుల్ రాజేందర్, రాజు, కళాజాత బృంద ఇఛార్జ్ వడ్లకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.






