calender_icon.png 24 May, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలి: ప్రధాని మోదీ

24-05-2025 06:30:00 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో దేశ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీమిండియాలా పని చేస్తే ఏదీ అసాధ్యం కాదని, 2047 నాటికి వికసిత్ భారత్ గా మారడంపైనే అందరి దృష్టి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం, నగరం, గ్రామాన్ని వికసిత్ గా మార్చడమే తమ లక్ష్యమని, కలిసి పనిచేస్తే లక్ష్యం చేరేందుకు 2047 వరకు వేచివుండే పనిలేదని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలని, 140 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చేందుకు పని చేయాలని ప్రధాని సూచించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలోమహిళల వాటా శ్రామిక శక్తిలో పెరగాలని మోదీ చెప్పారు. 

భవిష్యత్ నగరాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని, నగరాల అభివృద్ధికి ఆవిష్కరణ, స్థిరత్వం ఇంజిన్లుగా ఉండాలని ప్రధాని మోదీ వివరించారు. ప్రతి రాష్ట్రం ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నాయి. కానీ బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కలిసి ప్రధానమంత్రి నిర్వహిస్తున్న తొలి ప్రధాన సమావేశం ఇది. సాధారణంగా, పూర్తి కౌన్సిల్ సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం ఇది జూలై 27న జరిగింది.