calender_icon.png 18 September, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పీఎం మోడీ జన్మదిన వేడుకలు..

18-09-2025 01:01:52 AM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు అటహసంగా జరిగాయి. 75 వ పుట్టినరోజు రోజును పురస్కరించుకొని బుధవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే అమరాజల శ్రీదేవి ఆయురారోగ్యాలతో ప్రధానమంత్రి మోడీ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. బెల్లంపల్లిలో శిశు మందిరంలో విద్యార్థులు మధ్య ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ  నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడం దేశ ప్రజల అదృష్టం అన్నారు. ఇలాంటి నాయకుడు ఇప్పటి వరకు దేశంలో పుట్ట లేదన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.