calender_icon.png 18 September, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవిద్యార్థుల కలలు సాకారం చేస్తున్నాం

18-09-2025 01:00:54 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్,సెప్టెంబర్17(విజయాక్రాంతి): సంక్షేమ వసతి గృహాలు షెడ్యూల్ కులాల, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా తొలుత అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ,

మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ అలాం, అద నపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశంలతో కల సి నివాళులు అర్పించారు. అనంతరం పోలీ స్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూవీరికి ఉపకార వేతనాలు అందించడం తో పాటు, విదేశాల్లో ఉన్నత విద్యానభ్యసించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చే సేందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. బీ.సి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ, గురుకుల పాఠశాలలో అక్టోబర్ -2024 నుండి విద్యార్థులకు 200 శాతం డైట్ చార్జీ లు, 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామని అన్ని సంక్షేమ హాస్టళ్ల, గురుకులాలలో కామన్ డైట్ మెను అమలు చేస్తున్నామని అ న్నారు.

జిల్లాలో 9 డిసెంబర్ 2023 న ప్రా రంభించిన మహిళలకు ఉచిత బస్సు రవా ణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు 5 కోట్ల 35 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారని తద్వారా 227 కోట్ల 34 లక్షల రూ పాయల లబ్ధి పొందారన్నారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా మన జిల్లాలో ఒక లక్షా 57 వేల 120 లబ్దిదారులకు ఇప్పటి వరకు 6 లక్షల 33 వేల 737 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగిందన్నారు.

ఇందుకు గాను 19 కోట్ల 59 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు.గృహజ్యోతి పథకం ద్వా రా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తోంది. తద్వారా జిల్లాలో ఒక లక్షా 58 వేల 875 సర్వీసులకు గాను 6 కోట్ల 94 లక్ష ల 24 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరో సా ద్వారా జిల్లాలోని 12 వేల 483 వ్యవసాయ కూలీల కుటుంబాలకు 7 కోట్ల 48 లక్షల 98 వేల రూపాయలను జమ చేయ డం జరిగిందన్నారు.

జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే యడం జరిగిందని ఇప్పటికే 5 వేల 844 ఇండ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పను లు జరుగుతున్నాయని గృహ నిర్మాణాన్ని బట్టి దశల వారీగా లబ్దిదారులకు 45 కోట్ల 91 లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగిందన్నారు.అన్ని సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో అల్యూమినియం పాత్రల స్థానం లో స్టీలు పాత్రలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామనితెలిపారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 17 (విజయక్రాంతి)జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాం గణంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే, అధికారులు పాల్గొన్నారు.

ముందు గా ప్రభుత్వ విప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీక రిం చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ యన, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం చారిత్రాత్మక ఘట్టం. ఈ రోజు తెలంగాణ 77 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 09-12-2023న కొత్త ప్రభుత్వం ఏర్పడి, సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది అన్నారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై వివరాలు వెల్లడిస్తూ విప్ పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇందుకోసం ‘తెలంగాణ రైజింగ్2047’ రూపకల్పన చేయబడింది అని ఆయన చెప్పారు.మహిళల అభ్యున్నతి:జిల్లాలో డీఆర్డీఓ, మెప్మా ఆధ్వర్యంలో ఎస్ హెచ్ జీలకు 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించగా,

శ్రీనిధి రుణాల కింద ఇప్పటివరకు రూ.25 కోట్లకు పైగా మంజూరు చేసినట్టు తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు ఉచిత చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి, వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.ఆహార భద్రత:ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, జిల్లాలో లక్ష 77 వేల కుటుంబా లకు లబ్ధి చేకూరుతోందని ఆయన వివరించారు. కొత్తగా 14 వేల రేషన్ కార్డులు పంపి ణీ చేసి, పదేళ్ల తర్వాత రేషన్ షాపుల్లో సందడి కనిపిస్తోందని చెప్పారు.రైతు సంక్షే మం.గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ ప్రారంభించి, ఇప్పటివరకు రూ.20 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు.

ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల సాయం అందిస్తున్నాం. ఇప్పటివరకు 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ య్యాయి. పంటలకు బోనస్, ఉచిత విద్యు త్తో అన్నదాతల భరోసా నిలుస్తోంది అన్నా రు.ఇల్లు పింఛన్లు పథకాలు:జిల్లాలో 12,6 00 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.38 కోట్లు జమ చేసిన ట్టు తెలిపారు. చేయూత పింఛన్లు 1.17 లక్షల మందికి ప్రతి నెలా రూ.25 కోట్లుగా అందుతున్నాయని వివరించారు.

మహిళల కోసం మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాల కింద వందల కోట్ల రూపాయల లబ్ధి చేరిందని చెప్పారు.ఆరోగ్య భరోసా:ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచి, ఇప్పటివరకు 24 వేల మంది రోగులు లబ్ధి పొందారని, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా కోట్ల రూపాయల సహాయం అందించామని తెలిపారు.ఉద్యోగాలు విద్య :20 నెలల్లో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,

జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధం కావ డానికి విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించా రు.పనుల జాతర సాగునీరు:జిల్లాలో రూ. 7.8 కోట్లతో 258 పనులు ప్రారంభించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చివ రి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.