calender_icon.png 18 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

18-09-2025 01:02:47 AM

సంగారెడ్డి/ నారాయణఖేడ్/ నాగల్గిద్ద /తూప్రాన్ /చేగుంట, సెప్టెంబర్ 17 :సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని ఆయా మండల కేంద్రాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పిం చారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ జెండావిష్కరించారు.

అలాగే నాగల్గిద్దలో తహసీల్దార్ శివకృష్ణ, ఎంపీడీవో మహేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణ, డాక్టర్ జువేరియా, ప్రధానోపాధ్యా యులు జెండావిష్కరించారు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్లో కమిషనర్ గణేష్రెడ్డి జెండావిష్కరించగా, మున్సిపల్ మాజీ చైర్మన్ మామిళ్ళ కృష్ణ, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, ట్రస్ట్ చైర్మన్ రవీంద్రగుప్తా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చేగుంట మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల వద్ద కార్యదర్శులు జెండావిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు.