12 April, 2026 | 9:31 AM

ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ

11-11-2025 12:40 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు(Delhi Terror Attack) ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) తీవ్రంగా ఖంఢించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేధిస్తామని తేల్చిచెప్పారు. పేలుడు బాధ్యులను చట్టం ముందు నిలబెడతాయని వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన తమకు కలిచివేసిందని ప్రధాని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని తెలిపారు. ఢిల్లీ ఘటనపై దర్యాప్తు బృందాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నరేంద్ర మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూటాన్ లో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో  ప్రధానమంత్రి పాల్గొన్నారు. భూటాన్ కార్యక్రమంలో ఢిల్లీ పేలుడుపై స్పందించారు.

ఢిల్లీ పేలుడుతో అప్రమత్తమైన పౌరవిమానయాన భద్రత సంస్థ

ఢిల్లీలో పేలుడుతో పౌర విమానయాన భద్రతా సంస్థ(Civil Aviation Safety Agency) అప్రమత్తం అయింది. సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను బీసీఏఎస్ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, పైలట్ శిక్షణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సీసీ కెమెరాలను 24 గంటల పాటు పర్యవేక్షించాలని బీసీఏఎస్(Bureau of Civil Aviation Security) సూచించింది. విమానాశ్రయాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రయాణికులను, లగేజ్ ను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది. విమానాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పింది. అకస్మాత్తుగా ల్యాండ్ అయ్యే విమానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బాంబు నిర్వీర్య దళాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. విమానాశ్రయ పరిసరాల్లో స్థానిక పోలీసులతో కలిసి నిఘా పెంచాలని ఆదేశించింది. విమానాశ్రయ కార్ పార్కింగ్ ఏరియాలోనూ నిఘా పెంచాలని బీసీఏఎస్ సూచించింది. కార్గో విమానాల్లోనూ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని బీసీఏఎస్ పేర్కొంది. 13 మంది ప్రాణాలను బలిగొన్న పేలుడుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు.