27 July, 2026 | 12:55 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

Delhi Hotel Fire: ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

03-06-2026 04:45 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ మాలవీయ నగర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో(Delhi Hotel Fire) ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తీవ్ర విచారం వ్యక్తం(PM Modi condoles) చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బుధవారం నాడు దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఒక బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. మరణించిన వారిలో పలువురు విదేశీయులు ఉన్నారని, వీరు ప్రధానంగా మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందినవారని అధికారులు తెలిపారు. 

ఈ అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విచారం వ్యక్తం చేశారు, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. "మాల్వీయా నగర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ఈ హృదయ విదారక విషాదంతో ప్రభావితమైన వారందరికీ మనోధైర్యం, ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను." అని రేఖా గుప్తా ఎక్స్ లో పోస్టు చేశారు.