నలంద వర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని
19-06-2024 01:01 PM
బీహార్: నలంద విశ్వవిద్యాలయం దేశ విద్య వారసత్వానికి చిహ్నం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నలంద మహావిహారలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పర్యటిస్తున్నారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రాచీన నలంద వర్సిటీలోని శిథిలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర వి అర్లేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు.






