బీఆర్ఎస్, బీజేపీ కలిసొచ్చిన కాంగ్రెస్‌ను ఎదుర్కోలేవు
19-06-2024 12:52 PM
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేవని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. త్వరలోనే రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తోందన్న ఆయన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని జోస్యం చేప్పారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందని మల్లు రవి స్పష్టం చేశారు.






