29 August, 2026 | 1:33 PM

ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ

29-08-2026 10:12 AM

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్ దేశాల్లో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయేవ్‌తో(Uzbekistan President Shavkat Mirziyoyev) ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరు దేశాధినేతలు సమీక్షించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అజెండాను ఖరారు చేస్తారని మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి తాష్కెంట్‌లోని శాస్త్రి మెమోరియల్‌ను, అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని PMO వర్గాలు పేర్కొన్నాయి.