29 August, 2026 | 1:42 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం

29-08-2026 12:40 PM

నిజాంసాగర్, ఆగష్టు 29( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ప్రధాన జలవనరు సింగీతం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మరమ్మతులకు రూ.83.5 లక్షలు,నర్వ పాత చెరువు పంటకాలువ మరమ్మత్తులకు రూ. 48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధుల మంజూ రుకు కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు ఆయకట్టు ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు శనివారం మహమ్మద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి కృతజ్ఞతా భావంతో  పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,రవీందర్ రెడ్డి,అన్ని గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.