2 July, 2026 | 7:05 PM

రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పీఎండిడికేవై దోహదం.

13-05-2026 08:51 PM

గద్వాల(విజయక్రాంతి) : రైతులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు పీఎండీడికేవై దోహదపడుతుందని పీఎంవో డైరెక్టర్ రేగు అన్నారు.  ప్రధానమంత్రి  ధన ధాన్య కృషి  యోజన కార్యక్రమంలో భాగంగా పియంఓ డైరెక్టర్ రేగు, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ శ్రీకాంత్ బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా ఉండవల్లి మండలం మెన్నిపాడు గ్రామంలో, పైపాడు గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటలు, వడ్డేపల్లి మండలం జిల్లేడు దీన్నే గ్రామంలో అంజీర, దానిమ్మ తోటలను  సందర్శించి రైతులకు వివిధ సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్, డివిజనల్ ఉద్యాన అధికారులు రాజశేఖర్, ఇమ్రాన, మహేష్ , ,టీజీ ఆయిల్ఫేడ్ ఫీల్డ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.