25 May, 2026 | 12:56 PM

ఎంఎస్ఎంఇ పరిశ్రమల యజమానులతో పీఓ సమావేశం

13-12-2024 11:01 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఎమ్ఎస్ఎంఇ యూనిట్ ద్వారా సబ్సిడీపై రుణాలు పొంది చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకున్న లబ్ధిదారులు మార్కెట్ కు అనుగుణంగా వెసులుబాటు కల్పించుకొని తయారు చేసిన సామానులు అమ్మకాలు జరిపి ఆర్థికంగా లబ్ధి పొందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు ఐటిడిఎస్ సమావేశం మందిరంలో ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు నడుపుకుంటున్న లబ్ధిదారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పరిశ్రమ కొరకు సబ్సిడీపై రుణం పొందారో ఆ యూనిట్ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపి తప్పనిసరిగా నడిపించుకోవాలని అన్నారు.

ప్రతి ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండింగ్ కావలసినవి, రౌండింగ్ అయినవి, వాటిలోని సామాన్లకు బ్రాండింగ్ నిర్వహించడం, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం, మార్కెటింగ్ చేయించడం వంటి పనులకు ఐటిడిఏ సహకారం అందిస్తుందని అన్నారు. సంబంధిత యూనిట్ సభ్యులు తయారు చేసే వస్తువులను లోకల్ మార్కెట్ వెసులుబాటు కల్పించుకోవాలని, అన్ని సీజన్లో దొరికే ముడి సరుకులను కొనుగోలు చేసుకోవాలని, అత్యధిక లాభాలు పొంది పదిమందికి ఉపాధి కల్పించినప్పుడే తప్పనిసరిగా ఆ యూనిట్ లు సక్రమంగా పనిచేస్తాయని, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన వస్తువులు తక్కువ రేటుకు సంబంధించినవి తయారు చేయాలని, ఎక్కువ శాతం మార్కెట్లో అమ్మకాలు అయ్యే విధంగా మంచి డిజైన్లు తయారు చేయాలని అన్నారు. అశ్వాపురంలోని దాల్ యూనిట్, దుమ్ముగూడెంలోని చిక్కి యూనిట్, భద్రాచలంలోని న్యూట్రి బాస్కెట్ యూనిట్ సభ్యులు నిర్వహణ పట్ల చాలా ఆజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, యూనిటీ సభ్యులు అందరూ సమన్వయంతో ఉండి చర్చించుకొని యూనిట్ ను అక్రమంగా నడుపుకుంటానని హామీ ఇస్తే ఐటీడీఏ ద్వారా ఐదు లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పిస్తానని, హ్యాండీ క్రాఫ్ట్ యూనిట్ కి సంబంధించిన వస్తువులు మ్యూజియంకు వచ్చే టూరిస్టులకు అమ్మకాలు జరుపుకోవడానికి అలాగే బాగా ప్రాచుర్యం పొందడానికి ఆన్లైన్ ద్వారా బుకింగ్స్ సౌకర్యం కల్పించే విధంగా చూసుకోవాలని అన్నారు.

త్వరలో ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం ప్రారంభిస్తున్నందున వచ్చే టూరిస్టులకు ప్రత్యేకమైన తినుబండారాల స్టాల్స్, ఆదివాసి వంటకాలు, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, నాయక్ పో, కోయ కల్చర్ కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తామని సరసమైన ధరలకు వస్తువులు అమ్ముకొని ఆర్థికంగా లబ్ధి పొంది జీవనోపాధి పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎఫ్ డి ఓ ఉదయ్ కుమార్, జేడీఎం హరికృష్ణ, వివిధ మండలాల నుంచి వచ్చిన ఎం ఎస్ ఎం ఈ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.