25 May, 2026 | 12:13 PM

మెప్మా ఆర్పీల వేతనాలు పెంచాలి

13-12-2024 10:49 PM

పోలీస్ ల అక్రమ నిర్బంధంను ఖండించిన ఏఐటీయూసీ

పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో స్వయం సహాయక గ్రూప్ లో నిరంతరం కష్టపడి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్పీలకు గత 20 ఏళ్ళ నుండి కనీస వేతనం లేకుండా పాలకులు ఇబ్బందులు చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ అన్నారు. శుక్రవారం పాల్వంచ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్నారు, అనే అనుమానంతో అరెస్ట్ చేసిన వారిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్పీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పిఎఫ్, బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని అదనపు పని ఒత్తిడి తగ్గించాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పీల నాయకులు గుగులోత్ వీరమ్మ, మిర్యాల లక్మి, పానుగంటి నాగమణి మొగిలి సంధ్య, కటారపు మంజుల, స్వరూప, నిమ్మల నాగమణి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.