25 May, 2026 | 1:40 PM

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

13-12-2024 11:05 PM

మణుగూరు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పాయంను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తేనే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పల్లెల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.