25 July, 2026 | 2:41 AM

పెద్దేముల్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

25-07-2026 01:35 AM

తాండూరు, జూలై 24, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో శుక్రవారం ఆషాడమాసం శ్రీ పోచమ్మ తల్లికి మహిళలు ఘనంగా భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. వేకువ జాము నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. డోలు వాయిద్యాలు, డప్పుల దరువులు పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య మహిళలు పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మహిళలు భారీగా పాల్గొన్నారు.