29-06-2025 08:06:15 PM
బెజ్జంకి (విజయక్రాంతి): బెజ్జంకి మండల(Bejjanki Mandal) కేంద్రంలో రెడ్డి సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు(Pochamma Bonalu) ఘనంగా నిర్వహించారు. మమ్మల్ని, పిల్లా పాపాలను చల్లంగా చూడు పోచమ్మ తల్లి అంటూ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తల్లి ఆశీస్సులతో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.