23 June, 2026 | 2:30 PM

Breaking News

రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •  

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పోచారం..

28-10-2025 04:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో మంగళవారం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నియోజవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి DSO తో ఫోన్ లో మాట్లాడి లారీల కోసం ఎదురు చూడకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే ట్రాక్టర్లలో రైస్ మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైస్ మిల్లర్లు సైతం రైస్ మిల్లు వద్ద వెంట వెంటనే ధాన్యం బస్తాలను దింపుకోవాలని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథీన్‌ కాగితాలను  కప్పుకోని వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం రైతులు ఇబ్బంది పడకుండ ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించే విషయంలో గానీ, రైస్ మిల్లర్లతో మాట్లాడుతూ అండగా ఉండాలని ఆదేశించారు.