28-10-2025 04:39:27 PM
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య..
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండలాలలో రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐకెపి, సహకార సొసైటీల వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్నాయని వాటిని తూకం వేసి మిల్లులకు అధికారులు తరలిస్తున్నారని అన్నారు. మింథాన్ తుఫాన్ మూలంగా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం, అకాల వర్షాల వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లు వినియోగించుకోవాలన్నారు. వరి కోతలను నాలుగు రోజులపాటు రైతులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.