calender_icon.png 28 October, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలి

28-10-2025 04:45:21 PM

మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్..

నకిరేకల్ (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్, మండల విద్యాధికారి మేక నాగయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. తమ తల్లిదండ్రులు కన్న కలలను పిల్లలు సాకారం చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. పాఠశాల భవనాన్ని పరిశీలించి వర్షాలు వస్తున్నప్పుడు ఉన్న ఇబ్బందులను, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉన్నాయా.. లేవా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట, పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.