17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కవులు సామాజిక చైతన్య పరిచే రచనలు చేయాలి

29-04-2025 12:00 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ ఏప్రిల్ 28: కవులు సమాజాన్ని  చైతన్య పరిచే రచనలు చేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తికి చెందిన ప్రముఖ పద్య కవి ఆకుల శివరాజలింగం రచించిన కొన్ని పుస్తకాలు  జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ చదివి పరవశించి ఆనందంతో కవి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సంద ర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ...

సాహిత్యం సమాజ హితాన్ని కోరుతుంది కాబట్టి కవులు సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని కోరారు. ఆకుల శివరాజలింగంను స్పూర్తిగా తీసుకొని వర్తమాన కవులు రచనలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు, టి, వెంకట్ రాములు, వై, నగేష్ యాదవ్, నరేష్,  శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.