calender_icon.png 1 May, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటిన కండక్టర్‌కి ఆర్టీసీ ఎండీ అభినందన

29-04-2025 12:00:00 AM

అచ్చంపేట ఏప్రిల్ 28 : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు సుమారు 13 లక్షల విలువచేసే బంగారం ఆభరణాలు పోగొట్టుకోగా మానవత్వం చాటుకున్న కండక్టర్ తిరిగి ఆ ప్రయాణికుడికి సురక్షితంగా ఆభరణాలు అప్పగించడంపై సోమవారం సదురు కండక్టర్ ని ఆర్టీసీ ఎండీ సర్జనార్ హైదరాబాదులోని బస్సు భవన్లో అభినందించారు.

ఈనెల 26న హైదరాబాద్ నుండి అచ్చంపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న ప్రయాణికుడికి అచ్చంపేట డిపో కు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు ఆభరణాలను జాగ్రత్తపరిచి ఆ ప్రయాణికుడికి అప్పగించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సర్జనార్ నిజాయితీ చాటుకున్న కండక్టర్ను పిలిచి శాలువాతో సత్కరించి సన్మానించారు.