29-04-2025 12:00:00 AM
వికారాబాద్, ఏప్రిల్ -28: ప్రైవేటు పాఠశాలల హక్కులు కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ప్రైవేటు పాఠశాలల సంఘం ( ట్రస్మా) వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు చేవెళ్ల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని వైష్ణవి హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ( ట్రస్మా ) సాధారణ సమావేశం నిర్వహించారు. గత కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో నూతనంగా ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా చేవెళ్ల చంద్రశేఖర్ ( న్యూ గీతాంజలి విద్యాలయం వికారాబాద్ ) ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్( నారాయణ స్కూల్ వికారాబాద్) కోశాధికారిగా సి. సుధీర్( స్కాలర్ స్కూల్ వికారాబాద్ ) ఉపాధ్యక్షులుగా మద్దూర్ పాషా, సంయుక్త కార్యదర్శిగా యాదయ్య, ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షులు చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కారానికి 24 గంటలు పని చేస్తానని తెలిపారు. అదే విధంగా పాఠశాలలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే సంఘం దృష్టికి తీసుకురావాలని అందరం సమిష్టిగా పోరాడి సాధించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి , రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ ఎం నాగయ్య , జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి , జిల్లా కోశాధికారి వి ప్రకాష్, జిల్లాముఖ్య సలహాదారు వేణుగోపాలరావు, వికారాబాద్ నియోజకవర్గ వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.