16 April, 2026 | 12:09 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

కామారెడ్డి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

02-06-2025 01:18 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూన్ 1 (విజయ క్రాంతి ):  కామారెడ్డిజిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా. ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి  జిల్లాలో శాంతి భద్రతలను  దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జూన్ 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని   కామారెడ్డి  జిల్లా ఎస్పీ.  యం. రాజేష్ చంద్ర  పేర్కొన్నారు. 

పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీ లు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ  హెచ్చరించారు. 

జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు  ఈ విషయంలో సహకరించాలని తెలిపారు.  అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  హెచ్చరించారు.