16 April, 2026 | 12:09 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

రూ.7.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

02-06-2025 01:18 AM

షాద్ నగర్, జూన్ 1: షాద్ నగర్ పట్టణంలో రూ.7.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఆదివారం  సాయంత్రం విశ్వసనీయ సమాచారం  మేరకు మేడ్చల్ ఎస్‌ఓటి ఎస్త్స్ర ధనుంజ య, స్థానిక ఎస్త్స్ర శరత్, వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ ఏడి నిశాంత్ కుమార్ సంయుక్తంగా షాద్ నగర్ పట్టణంలో ని  పరిగి రోడ్డు బకర్మన్ గార్డెన్  సమీపంలో నిషేధిత న కిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం అం దింది.

  దీంతో అధికారులు అంతా  అక్కడికి చేరుకొని అనుమానాస్పదంగా నిలిపి ఉన్న  హోండా మొబిలి యో ఏపీ 03 బిఏల్ 5204 నంబరు గల వాహనాన్ని తనిఖీ చేశారు.అందులో  300 కిలోల నిషేధించిన ప త్తి విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. వీర వసంత రావు అనే వ్యక్తి అమరావతి మం డలం పల్నాడు జిల్లా నుండి చంద్రలపాడు గ్రామము, ఎన్టీఆర్ జిల్లా కు చెందిన జంపాని నాగేశ్వర్ రావు పరిగి పట్టణంలో నివాసమంటూ  వికారాబాద్ మండలం ధ్యా చెర్ల గ్రామములో పొలం కౌలుకు తీసుకోని వ్యవసాయం చేస్తున్నాడు.

అట్టి పొలంలో  నిషేదిత పత్తి విత్తనాలను సాగు చేస్తూ  మరో పక్క రైతులకు గుర్తుచప్పు డు కాకుండా  షాద్ నగర్ లోని పరిగి రోడ్ లో గల బక్కర్మన్ గార్డెన్ సమీపంలో నిషేదిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు.  ముగ్గురు రైతులకు  నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తుండగా  పోలీసు మరియు వ్యవసా య శాఖ అధికారులు సమీక్షంగా దాడి చేసి  పట్టుకున్నారు. ఇట్టి తనిఖీలో  షాద్ నగర్ ఇన్చార్జ్ ఏడి అగ్రి కల్చర్ నిశాంత్ కుమార్, ఫరూక్ నగర్ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ్ కుమార్, ఎస్త్స్ర శరత్, మేడ్చల్ ఎస్‌ఓటి ఎస్త్స్ర ధనుంజయ లు పాల్గొన్నారు.