calender_icon.png 15 January, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిరాణా షాపుల్లో చైనా మంజా కోసం పోలీసుల తనిఖీ

15-01-2026 12:44:02 AM

సిర్గాపూర్/కల్హేర్, జనవరి 14: సిర్గాపూర్, కల్హేర్ మండల పరిధిలోని పలు కిరాణా షాపుల్లో ఎస్‌ఐ మహేష్, ఎస్‌ఐ-2 నారాయణ ము మ్మరంగా చైన మంజా కోసం తనిఖీ నిర్వహించారు. ఎస్‌ఐ మ హేష్ మాట్లాడుతూ చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చైనా మాంజాపై నిషేధం ఉందన్నారు.

అలాగే ఈ మాంజా వల్ల కొంత మంది గాయాలపాలవుతుండగా, మరి కొంత మంది చనిపోతున్నారని అందుకే ఇది ప్రజలకు, పక్షులకు హాని కలిగించే చైనా మాంజా విక్రయాలను అడ్డుకుంటున్నామని తెలిపారు. పలు పతంగుల దుకాణాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు ఎటువంటి చైనా మాంజాలు దొరకలేదన్నారు. చైనా మంజాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.