22 April, 2026 | 6:17 PM

గ్రామాల్లో రూ.1.29 కోట్లతో పలు అభివృద్ధి: ఎమ్మెల్యే

22-04-2026 05:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): జాఫ్రాపూర్ గ్రామంలో రూ.63.5 లక్షలతో సరస్వతి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పునరుద్ధరణ, సంగేంపేట గ్రామంలో రూ.66.4 లక్షలతో చెరువు తూము అలుగు మరమత్తు పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సొన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో రూ.63.5 లక్షలతో సరస్వతి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పునరుద్ధరణ నిర్మాణ పనులకు, సంగేంపేట గ్రామంలో రూ.66.4 లక్షలతో చెరువు తూము అలుగు మరమ్మత్తుల పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ మరమ్మత్తుల పనులు పూర్తయితే రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సరికేల గంగన్న, మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డి, సర్పంచ్ లు రాజు రెడ్డి, మారీ విలాస్, మల్లేష్, నరేష్, నర్సారెడ్డి, A నర్సారెడ్డి, రాజేశ్వర్, భూమా రెడ్డి, ప్రశాంత్, గంగారెడ్డి, మక్కన్న, తో పాటు విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.